సిద్దిపేట వైద్య విద్యార్థులే నెంబర్‌వన్‌గా ఉండాలి: హరీశ్‌

67
harishrao
- Advertisement -

తెలంగాణ మారుమూల గ్రామీణ ప్రాంత వాసుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌న్న‌దే సీఎం కేసీఆర్ ధ్యేయ‌మ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. మరో 6 నెలల్లో సిద్దిపేటలో 900 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి అందుబాటులోకి రానున్నద‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట వైద్య విద్యార్థులు నెంబర్ వన్ ఉండాలన్నదే త‌న ఆకాంక్ష అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన‌ ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల వార్షికోత్స‌వంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, పోలీసు కమిషనర్ శ్వేత, మెడికల్ డైరెక్టర్ విమలా థామస్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మెడికల్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థులలో వైద్య విద్యపై ఆసక్తి పెంచేలా మెడ్ ఎక్స్ పో చేపట్టిన వైద్య కళాశాల విద్యార్థుల బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య విద్యకు తెలంగాణ రాష్ట్రం దూరంగా ఉండేదన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 840 ఏంబీబీఎస్ సీట్లు ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వాటిని పెంచి నాలుగింతలు చేశామని తెలిపారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి రాక రష్యా, ఉక్రెయిన్ వెళ్లలేక, తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య అందక తెలంగాణ విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య, వెటర్నరీ, అటవీ, వ్యవసాయ విద్యకు వేలాది కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నద‌ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున పీజీ సీట్లు అందుబాటులోకి తేనున్నది. ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీలో సైతం సీట్లు తేనున్నామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -