ఇండియన్‌ ఐడల్‌ విన్నర్ గా తెలుగు తేజం

224
- Advertisement -

రేవంత్‌ సౌత్ ఇండియన్ యువ సింగర్ ఇండియన్ ఐడల్ అనే ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇతని పూర్తి పేరు “లోలా వెంకట రేవంత్ కుమార్‌ శర్మ”రేవంత్‌ ఫిబ్రవరి 10.1990 శ్రీకాకుళంలో జన్మించాడు. ఇతను పుట్టక ముందే ఈయన తండ్రి చనిపోయాడు.తల్లి,అన్నయ్య సహకారంతో సింగర్‌గా ఎదిగాడు. రేవంత్‌ 2008లో వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం అందించిన మహా యజ్ఞం అనే సినిమాలో మొదటిసారిగా సింగర్‌గా తన కెరీర్‌ స్టార్ట్‌ చేశాడు. తర్వత ప్రముఖ సంగీత దర్శకుడు యం యం కీరవాణి దగ్గర శిక్షణ పొందుతు 200 పాటలకు పైగా పాడాడు.ఈయన ఈగ,బహుబలి సినిమాలతో మంచి గుర్తింపు పొందాడు బహుబలి సినిమాలో మనోహరి అనే పాటకు అవార్డును కూడా తీసుకున్నాడు.అంతే కాకుండా సింగర్‌గా కొనసాగుతూనే మరో వైపు టీవీ షోలలో యంకర్‌గా పార్టిసిపేట్‌ గా అలరించాడు.

ఎల్ వీ రేవంత్ మరి ఇప్పుడు తన లక్ష్యన్ని సందించుకున్నాడు. సౌత్ ఇండియన్ యువ సింగర్ ఇండియన్ ఐడల్ అనే ఘనతను సొంతం చేసుకున్నాడు.మరో తెలుగోడు ఇండియన్‌ ఐడల్‌ టైటిల్‌ కొట్టాడు! ‘బాహుబలి’ చిత్రంలో ‘మనోహరి’.. ‘దమ్ము’లో ‘రూలర్‌ (మూవీ వెర్షన్‌)’ సహా పలు తెలుగు చిత్రాల్లో పాటలు పాడి సత్తా చాటిన రేవంత.. ఇండియన్‌ ఐడల్‌ 9 విజేతగా నిలిచాడు!! హిందీ భాష మీద అంతగా పట్టు లేకున్నా.. ఉత్తరాది సింగర్ల నుంచి ఎదురైన పోటీని తట్టుకుని చివరిదాకా నిలిచి గెలిచాడు. జడ్జిల ప్రశంసలతోపాటు.. ప్రేక్షకుల అభిమానమూ పొందిన రేవంతను ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 9 గ్రాండ్‌ ఫైనల్‌లో విజేతగా మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రకటించాడు.

Revanth Wins Indian Idol Grand Finale

రేవంతతో పోటాపోటీగా నిలిచిన ఖుదాబక్ష్‌ (పంజాబ్‌) ఫస్ట్‌రన్నర్‌పగా నిలవగా మరో తెలుగువాడైన పీవీఎన్‌ఎస్‌ రోహిత సెకండ్‌ రన్నర్‌పగా నిలవడం విశేషం. ఇండియన్‌ ఐడల్‌ టైటిల్‌ను గెలుచుకున్న రెండో తెలుగుతేజం రేవంత. గతంలో గాయకుడు శ్రీరామ చంద్ర ఈ పోటీల్లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు సింగర్‌ కారుణ్య రన్నర్‌పగా నిలిచాడు. ఈ పోటీలో విజేతగా నిలిచిన రేవంతకు రూ.25 లక్షల నగదు, మహీంద్ర కేయూవీ100 వాహనం, సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం బహుమతిగా దక్కాయి.ఈ పోటీల్లో తనకు మద్దతు తెలిపి తన విజయానికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. గాయకుడిగా బాలీవుడ్‌లో స్థిరపడాలని ఉందని.. కాని ముందు తన హిందీని మెరుగుపరచుకోవాల్సి ఉన్నదని రేవంత చేప్పాడు.

- Advertisement -