యాంకర్ పై సింగర్ సునీత ఫైర్

40
suntiha
- Advertisement -

ఓ యాంకర్‌పై సింగర్ సునీత ఫైర్ అయ్యారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన రెండోపెళ్లిపై ప్రశ్నలు అడగడంతో సీరియస్ అయింది సునీత.ఈ వయసులో మీకు రెండో పెళ్లి అవసరమా అంటూ మీపై ట్రోల్స్‌ వచ్చాయి కదా, దానికి మీరేమంటారు అని యాంకర్ అడగ్గా తనదైన శైలీలో సమాధానం ఇచ్చారు.

చాలా సినిమాలకి పాటలు పాడాను, డబ్బింగ్ చెప్పాను. వాటి గురించి అడగకుండా నా పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు ఫోకస్ చేస్తున్నారు. మంచి విషయాలు, కెరీర్ గురించి అడగొచ్చు కదా. ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు, ఎదుటి వాళ్ళని ప్రశ్నలు అడిగేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించి అడిగితే మంచిది అంటూ సిరీయస్ అయింది.

వెండితెర టాప్ సింగర్స్ లో ఒకరు సునీత. తన అద్భుతమైన గాత్రంతో, ఎన్నో వందల పాటలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించింది. గతేడాది ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది.

- Advertisement -