- Advertisement -
‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘మహాత్మ’, ‘టెర్రర్’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘కల్యాణ వైభోగమే’ ‘ఓ బేబీ’ చిత్రాలతో మాటల – పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల. ప్రస్తుతం చిరంజీవి గారి గాడ్ ఫాదర్, గుర్తుందా శీతాకాలం, నందిని రెడ్డి అన్నీ మంచి శకనములే సినిమాలకు సంభాషణలు అందిస్తున్నారు. కృష్ణ వంశీ రంగ మార్తండ కోసం ఒక అద్భుతమైన షహరి రాశారు. మరో వైపు నిర్మాతగాను అడుగులు వేస్తున్నారు.
“లక్ష్మీ భూపాల ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను, నిర్మాతగా రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి, వాటి వివరాలు త్వరలో మీడియాకు తెలియజేయనున్నాను. గాడ్ ఫాదర్ రచయితగా నాకు మరింత పేరును తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాను. నా ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త నటీనటులను, సాంకేతిక నిపుణులను తెలుగు తెరకు పరిచయం చెయ్యబోతున్నాను” అన్నారు భూపాల.
- Advertisement -