- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న 72,540 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా 33,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.91 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
ఇక శ్రీవారికి కరూర్ వైశ్యాబ్యాంక్ ఐదు బ్యాటరీ వాహనాలను విరాళంగా అందజేసింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సుమారు రూ. 30 లక్షల విలువగల 8-సీటర్ బ్యాటరీతో నడిచే ఐదు వాహనాలను విరాళంగా అందజేశారు.
- Advertisement -