- Advertisement -
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఆయనపై సస్పెన్షన్ విధించారు. అసెంబ్లీ సబ్ రూల్ 2, రూల్ 340 కింద బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేస్తూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. సమావేశాలు ముగిసే వరకు రాజేందర్‌ను సస్పెండ్ చేశారు.
స్పీకర్‌ను మరమనిషి అని సంబోందించారు ఈటల. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పేందుకు ఈటల నిరాకరించారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి వేముల తెలిపారు. స్పీకర్ పోచారంను మరమనిషి అని అనడం బాధాకరమన్నారు.
- Advertisement -