విడాకులు తీసుకున్న యోయో హనీ సింగ్‌

64
singh
- Advertisement -

ప్రస్తుత కాలంలో వివాహం అనేది  నానాటికీ బలహీన పడుతోంది. ముఖ్యంగా సినీ రంగంలో ఎదో ఒక సెలబ్రెటీ జంట విడాకులు తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకుల నుండి ధ‌నుష్‌, ఐశ్వర్యల‌ వ‌ర‌కు చాలా మంది సెల‌బ్రెటీ క‌పుల్ ఈ మ‌ధ్య విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మ‌రో బాలీవుడ్ జంట విడాకుల‌ను తీసుకుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ర్యాప్‌ సింగర్‌ యో యో హ‌నీసింగ్. తాజాగా త‌న భార్య నుండి విడాకులు తీసుకున్నారు. ఈ జంట దాదాపు ప‌దేళ్ళ వివాహా బంధానికి ముగింపు ప‌లికారు. తన భార్య నుండి విడాకులు తీసుకున్నారు.

గ‌తేడాది హ‌నీసింగ్‌ భార్య షాలినీ త‌ల్వార్ హ‌నీసింగ్ త‌న‌ను లైంగికంగా, మాన‌సికంగా వేధిస్తున్నాడ‌ని, అంతేకాకుండా ఇత‌ర మ‌హిళ‌ల‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడ‌ని ఆరోపిస్తూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో గృహ‌హింస నిరోధ‌క చ‌ట్టం కింద దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే కోర్టు ఇరు వాద‌న‌లు విన్న త‌ర్వాత విచారించి అనంత‌రం వీరికి విడాకులు మంజూరు చేసింది.

హనీసింగ్‌ నుంచి భరణంను చర్చల ద్వారా తీసుకోవాలని సూచించారు. ముందుగా షాలినీ త‌ల్వార్ భ‌ర‌ణంగా రూ.10 కోట్లు డిమాండ్ చేసింది. అయితే చ‌ర్చ‌ల అనంత‌రం కోటీ రూపాయల‌కు ఇద్ద‌రూ అంగీక‌రించారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య చర్చల అనంతరం భ‌ర‌ణంగా హ‌నీసింగ్ కోటీ రూపాయ‌ల‌ను స‌మ‌ర్పించారు. 2011లో వివాహా బంధంతో ఈ సెల‌బ్రెటీ జంట ఒకట‌య్యారు. మ‌ధ్య‌లో మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతే విడాకులు తీసుకున్నారు. కాగా ఈ జంట‌కు పిల్ల‌లు లేరు.

- Advertisement -