ఉద్యోగ,ఉపాధి కల్నకు ప్రభుత్వ పెద్దపీటవేస్తోందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్‌లో 9 లక్షల 12 వేల చేపపిల్లలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ కలిసి విడుదల చేశారు.
కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంట్‌తో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కుల వృత్తుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మత్స్యకారుల సంక్షేమానికి రూ. 500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
రాష్ట్రం నుంచి వేరే ప్రాంతాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. మైలారం పోతే మంచి చేపలు దొరుకుతాయి అనే పేరు తీసుకురావాలి. మంచి స్థలం చూసి హోల్ సెల్ మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందు కోసం ఓ బిల్డింగ్ కూడా కట్టిస్తానని, కోల్డ్ స్టోరేజ్ కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.