ఏవరైనా ఒక కట్టడం కడితే తరాలు చెప్పుకునే విధంగా ఉండాలని దృఢంగా నిర్మిస్తారు. మరికొందరు సునామీలు భూకంపాలు అగ్నిపర్వతాలు వచ్చిన కూలిపోకుండా నిర్మిస్తారు. ప్రాచీన భారతీయులు తమ ఇండ్లను నిర్మించేటప్పుడు అనేక వాస్తు దోషాలు చూసి…చాలా పక్బదింగా నిర్మిస్తారు. కానీ డెమొక్రటిక్ రిపబ్లిక్ కాంగోలో ఓ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేస్తుండగానే కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వర్షకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఈ చిన్న బ్రిడ్జ్‌ను నిర్మించారు. అయితే దీనిని ప్రారంభించేందుకు ఒక మహిళా ప్రభుత్వ అధికారి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఆమె అలా రిబ్బన్ కట్ చేయగానే ఇలా కూలిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు…సదరు మహిళ అధికారిని కాపాడారు. ప్రారంభోత్సవం రోజునే ఇలా బ్రిడ్జ్ కూలిపోవడంతో నిర్మాణ నాణ్యత, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దుమ్మెత్తిపోస్తున్నారు.
అలా రిబ్బన్ కట్.. ఇలా కూలిపోయింది ఎక్కడో తెలుసా
- Advertisement -
- Advertisement -