పవన్‌పై పరుచూరి ఆసక్తికర వ్యాఖ్యలు

167
paruchuri
- Advertisement -

పవర్ స్టార్, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. పవన కళ్యాణ్ ఇటీవలే పుట్టిన రోజు చేసుకున్నారు. ఆయనకి నా శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ ఆశయం నెరవేరాలన్నారు. గతంలో చాలా మంది సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ వాళ్లంతా ఏదో ఒకసారి పదవిలోకి వచ్చి వెళదాం, ఏదో ఒక పార్టీలో సీటు తెచ్చుకుందాం అనుకునేవాళ్లే. కానీ పవన్ జనాలకి ఏదో చేయాలనే ఆశయంతో వచ్చారని కొనియాడారు.

ఒక్కోసారి సామజిక సమీకరణాల వల్ల రాజకీయాలు మారిపోతాయి. పవన్ కళ్యాణ్ వాయిస్ చట్టసభల ద్వారా వినపడాలి అని నేను కోరుకుంటున్నాను అని తెలిపారు. పవన్ కి అన్ని విషయాలు మన అందరి కంటే ఎక్కువ తెలుసు. పవన్ యోగా చేస్తారు. ఆయన చిరునవ్వు, ఆయన ఆవేశం వెనుకాల అనేక కారణాలు ఉంటాయన్నారు.

అందుఏ వచ్చే ఎన్నికలకు ముందే మరిన్ని సినిమాలు చేసి పవన్ ప్రజల్లోకి మరింతగా వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ ఈ సారి గెలిచి చట్టసభల్లోకి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పారు.

- Advertisement -