- Advertisement -
బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నేటి నుండి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కన్యాకుమారి నుంచి మెగా ర్యాలీ భారత్ జోడో యాత్ర ప్రారంభంకానుంది.
ఈ నేపథ్యంలో పెరంబదూర్‌లో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకం వద్ద నివాళి అర్పించారు రాహుల్. అనంతరం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ విద్వేష, విభజన రాజకీయాలకు తన తండ్రి బలయ్యాడని, కానీ అటువంటి విద్వేష రాజకీయాలకు దేశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనని తేల్చిచెప్పారు.
1991, మే 21వ తేదీన శ్రీపెరంబదూర్‌లో జరిగిన సూసైడ్ అటాక్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృతిచెందారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిల్ ఈళం ఆ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
- Advertisement -