మళ్ళీ చిక్కుల్లో పడ్డ హాట్‌ భామ..

198
- Advertisement -

హాట్ భామ అమలా పాల్ తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది . ఈ అమ్మడు చేసిన యోగా విన్యాసాలు ఓ రేంజులో వివాదాల్ని మోసుకొచ్చాయి. ఇప్పటికే పలు వివాదాలు ఈ భామని చుట్టు ముట్టగా…తాజాగా ఈ అమ్మడు చెసిన యోగాసనాలు మళ్ళీ చిక్కులు తెచ్చిపెట్టాయి.

ఇంతకీ ఈ అమమ్మడు చేసిన యోగాసనాలు ఎందుకు వివాదానికి కారణమయ్యాయంటే..ఈ అమ్మడు గౌతమ బుద్దుడి తల దగ్గర కాళ్ళు పెట్టి చేసిన యోగాసనమే అమలా కొంప ముంచేలా చేశాయి.

  Controversy Over Amala's Yoga Pose

యోగాసనాలు వేస్తూ రకరకాల భంగిమల్లో ఫోజులు పెట్టింది అమలా పాల్. ఆ విన్యాసాల్లో భాగంగా అరికాలి పాదం గోడ‌పై బుద్ధుడి ఫోటోని తాకుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

అంతేకాకుండా ఈ ఫోటోని సామాజిక మాధ్య‌మంలో షేర్ చేసింది అమ‌లా. దీంతో ఆమె వేసిన యోగాసనాలు వివాదాస్పదం అయ్యాయి. ఈ బ్యూటీ చేసిన పనికి పెద్ద ఎత్తున బౌద్దులు నిరసన వ్యక్తం చేస్తున్నారు . అంతేకాకుండా గౌతమ బుద్దుడి చెంపపై అమలా పాల్ కాళ్ళు పెట్టడం తో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.

  Controversy Over Amala's Yoga Pose

వెంట‌నే ఆ ఫోటోని డిలీట్ చేయ‌మ‌ని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే బౌద్దులు అన్ని నిరసన చేసినా..అమలాపాల్‌ మాత్రం వేటికీ స్పందించ‌లేదు. ఆ ఫోటోని డిలీట్ చేయ‌లేదు. ఇదంతా చూస్తుంటే.. అస‌లు అమ‌ల కావాల‌నే ఇలా చేసిందా? అంటూ మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -