ఆ పాత్రలే పవర్‌ఫుల్‌ అంటున్న జక్కన్న…

161

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బాహుబలి 2’ సినిమా గురించే టాక్‌ . దీంతో సోషల్‌ మీడియాలో సైతం హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది బాహుబలి2. త్వరలో ‘బాహుబలి2 సందడి మొదలవనుంది. ఇక ఆ రోజుకోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో వేరే చెప్పక్కర్లేదు.

అయితే ఇప్పటికే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న తో ప్రేక్షకుల్లో కునుకు లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ‘బాహుబలి ది: కన్‌క్లూజన్‌’కు సంబంధించిన పలు విషయాలను దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి పంచుకున్నారు.

Rajamouli Reveals Crucial Details About Sivagami And Devasena .

ఇలా ఒక్కోరోజు ఒక్కో విషయాన్ని బయటపెడుతూ.. `బాహుబ‌లి-2`పై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు జ‌క్క‌న్న‌. ‘బాహుబలి 2’ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ, శివగామి – దేవసేన పాత్రలకు సంబంధించిన విషయాల్ని లీక్‌ చేశాడు . ‘బాహుబలి’ మొదటిభాగంలో శివగామి పాత్ర చాలా బలమైనదిగా కనిపించిందనీ, రెండవ భాగంలో శివగామితో పాటు దేవసేన పాత్ర కూడా బలమైనదిగా కనిపిస్తుందని చెప్పాడు.

Rajamouli Reveals Crucial Details About Sivagami And Devasena .

ఈ రెండు పాత్రల మధ్య చోటుచేసుకునే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయని అన్నాడు. ర‌మ్య‌కృష్ణ‌- అనుష్క పాత్ర‌ల మ‌ధ్య `ల‌వ్ హేట్‌` రిలేష‌న్‌షిప్ ఆడియెన్ మ‌తి చెడ‌గొడుతుంద‌ని చెప్పాడు.

శివ‌గామి పాత్ర ఎంత బ‌ల‌మైన‌దో, దేవ‌సేన పాత్ర అంతే బ‌ల‌మైన‌దని, ఆ ఇద్ద‌రి బంధంపైనా 20-30 నిమిషాల నిడివితో సీన్స్ అద‌ర‌హో అన్న‌ట్టే ఉంటాయ‌ని చెప్పాడు రాజమౌళి. అంతే కాకుండా ఈ రెండు పాత్రలు ఈ సినిమాలో కీలకంగా నిలుస్తాయనీ, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయని చెప్పాడు దర్శకుడు రాజమౌళి.