ముంబైలోని ఫేమస్ గణేష్ మండపం లాల్‌బాగ్‌లోని లాల్ బాగ్చా రాజా గణేషుడిని దర్శించుకున్నారు. మధుర్ బండార్కర్ కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాకి ఫోజులిచ్చారు. బాబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గణేషుడిని దర్శించుకున్నారు.
ఈ గణేష్ మండపం దగ్గర దిగిన ఫోటోలని తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఎక్కడున్నా, ఎలాంటి వర్క్ లో ఉన్నా కచ్చితంగా లాల్ బాగ్చా రాజా గణేశుడ్ని దర్శించుకుంటాను. కానీ గత మూడు సంవత్సరాలుగా కుదర్లేదు. మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వినాయకుడ్ని దర్శించుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉందని తెలిపింది తమన్నా.
ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది తమన్నా. ఇప్పటికి కూడా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో వరుస ఛాన్సులు సాధిస్తుంది ఈ మిల్కీ బ్యూటీ. త్వరలో బాలీవుడ్ లో బాబ్లీ బౌన్సర్ అనే సినిమాతో రాబోతుంది.