బ్రహ్మాస్త్ర…ఎంత నష్టమో తెలుసా?

131
nag
- Advertisement -

రణబీర్ కపూర్, అలియా జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. నాగార్జున, అమితాబ్, మౌనిరాయ్ ముఖ్యపాత్రల్లో నటించగా పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఘనంగా ప్లాన్ చేయగా ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తూ ఈవెంట్ క్యాన్సిల్ అయింది.

ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో చిత్ర యూనిట్ కి భారీగా నష్టం ఏర్పడింది. అన్ని ఖర్చులు కలిపి ఈవెంట్ కి దాదాపు 2 కోట్లకు పైనే అయినట్టు తెలుస్తుంది. ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో ఆ రెండు కోట్లు వృధా అయినట్టే.

రాజమౌళి మాట్లాడుతూ.. ఫైర్ వర్క్స్, ఎన్టీఆర్, రణబీర్ తో స్పెషల్ ఎఫెక్ట్స్ ప్లాన్ చేశాం కానీ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో నిరాశ చెందామన్నారు.

- Advertisement -