దర్శకులకు గాడ్ ఫాదర్ క్లాస్‌!

106
chiru
- Advertisement -

దర్శకులకు మరోసారి క్లాస్ ఇచ్చారు గాడ్ ఫాదర్ చిరంజీవి. ఇటీవల తెలుగు సినిమాలు వరుస ఫ్లాపులు చవిచూస్తుండగా దీనిపై దర్శకులను ఉద్దేశించి చిరు చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశం కాగా తాజాగా మరోసారి దర్శకులక క్లాస్ ఇచ్చారు చిరు.

వంశీ లక్ష్మి నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరు. ఈ సందర్భంగా సినిమా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ.. ఇటీవల జనాలు థియేటర్స్ కి రావట్లేదు అంటున్నారు. ఏవేవో కారణాలు చెప్తున్నారు. కానీ అది చాలా తప్పు. సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారన్నారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు లేకుంటే తిరస్కరిస్తారని…ఆ విషయంలో నేనూ బాధితుణ్నే అన్నారు.

ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కథల మీద దృష్టి పెట్టాలి. ఒక సినిమా ఎందుకు హిట్‌ అయింది, ఎందుకు ఫ్లాప్‌ అయింది అని ఆలోచించాలి. డైరెక్టర్లే సినిమాకి కెప్టెన్స్. ఒక సినిమా కథ రాసేటప్పుడు ఒక ప్రేక్షకుడిలా ఆలోచించాలన్నారు. డైరెక్టర్స్ జాగ్రత్తగా కథలు రాస్తే, ఆడియన్స్ ని ఆకట్టుకునే కథలు రాస్తే హిట్స్ అవే వస్తాయని చెప్పారు.

- Advertisement -