పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది :తలసాని

40
vijaya
- Advertisement -

పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని యాదవ్‌ అని అన్నారు. రాజేంద్రనగర్‌లో పాడి రైతుల అవగాహన సదస్సు లో పాల్గోన్న మంత్రి… విజయ డెయిరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపారు. డెయిరీ పాల సేకరణ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా పాడి రైతులకు మంత్రి శుభవార్త తెలిపారు. పాల సేకరణ ధరను పెంచుతున్నట్లు ప్రకటించారు. లీటర్‌ గేదె పాల ధరను రూ.46.69 నుంచి రూ.49.40కు పెంచున్నట్లు పేర్కొన్నారు. ఆవు పాల ధరను రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. పాడి గేదెలకు ఉచితంగా మందులు, వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని తెలంగాణ ఏర్పాటు తర్వాత లాభాల్లోకి వచ్చిందన్నారు. పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుదని మంత్రి తలసాని యాదవ్‌ అని అన్నారు.

- Advertisement -