- Advertisement -
ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు పెద్దపల్లికి చేరుకోనుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సారెస్పీ క్యాంపులో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, గౌరెడ్డిపేట శివారులో పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో నిర్మించిన పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
తర్వాత కలెక్టరేట్ సమీపంలోని పెద్దకల్వలలో 50 ఎకరాల విస్తీర్ణంలోని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. వాహనాల పార్కింగ్ కోసం 132 ఎకరాలు కేటాయించారు.
- Advertisement -