మోహన్‌లాల్ వృషభ అనే టైటిల్‌తో కొత్త సినిమా రాబోతుందని మాలివుడ్ టాక్. మలయాళం మరియు తెలుగులో చిత్రీకరించి తమిళం, కన్నడ మరియు హిందీలో డబ్ చేయబడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. వృషభ అనేది తండ్రి-కొడుకుల మధ్య జరిగే సమరమని…తండ్రి పాత్రలో మోహన్‌లాల్ నటించనున్నారని మాలివుడ్ టాక్. అయితే కొడుకి పాత్రకి ఎవరిని ఎంపిక చేశారనదే తెలియరాలేదు. శ్యామ్ సుందర్ (ఫస్ట్ స్టెప్ మూవీస్), ఏవీఎస్ స్టూడియోస్ సమర్పణలో వృషభను నిర్మిస్తున్నారు. నంద కిషోర్ దర్శకత్వం వహించగా అభిషేక్ వ్యాస్, ప్రవీర్ సింగ్ మరియు శ్యామ్ సుందర్ నిర్మాతలుగా ఉన్నారు. ఈ చిత్రం మే 2023లో సెట్స్‌పైకి వెళ్లి…. 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
“నేను స్క్రిప్ట్ విన్న క్షణంలో, నన్ను నేను వృషభగా ఆలోచించడం మొదలుపెట్టనాని…జీవితకాలమంతా ఉండే తండ్రీ కొడుకుల మధ్య హై-ఎనర్జీ డ్రామా అని అన్నారు. ఈ మొదటి చిత్రంలో ఏవీఎస్ స్టూడియోస్‌తో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది” అని మోహన్‌లాల్ చెప్పారు.
దర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ, “ప్రతి మంచి చిత్రానికి గుండె ఆధారం ఏమిటంటే, మీరు ఈ సినిమా చూసిన తర్వాత సంవత్సరాల తరబడి మీతో కనెక్ట్ అయ్యే పాత్రలు ఉంటాయన్నారు. నేను గత 5 సంవత్సరాలుగా వృషభ స్క్రిప్ట్ రాస్తున్నాని ఇది కేవలం మోహన్‌లాల్‌ను ఊహించుకొని రాసుకున్న కథ అని అన్నారు. ఇది ఒక కల కానీ నిజమవుతుందన్నారు. ఇద్దరి పరస్పర విరుద్ధ భావోద్వేగాలను కలిగి ఉండే పాత్రలతో సినిమాను తెరకెక్కిస్తున్నామని డైరెక్టర్ నందకిషోర్ తెలిపారు. మోహన్‌లాల్ తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.