1970వ దశాబ్దంలో పెద్ద ఎత్తున్న జనాభా నియంంత్రణ అపరేషన్‌లు నిర్వహించింది అప్పటి ప్రభుత్వం. కానీ క్రమేపి దేశ జనభాలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యధిక పన్నులు దక్షిణాది రాష్ట్రాల నుంచి వసూలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా ఉంటున్నాయి. తాజాగా పార్లమెంట్‌లో మన గళం విప్పేవారు కూడా తక్కువ అవుతారాని జనభా లెక్కలు చెబుతున్నాయి. 2026లో డీలిమిటేషన్‌ను చేపడితే దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ స్థానాలు కుదించుకుపోతాయి. అందుకు కారణం ఇక్కడి రాష్ట్రాల్లో జనభా తగ్గుతుండటమే. కానీ ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే జనభా మార్పుల్లో గణనీయంగా వ్యత్యాసం కనపడుతోంది. జనాభా నియంత్రణతో సహా అనేక అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్ల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక వేళ అదే కనుక జరిగితే.. న్యాయాన్ని అపహాస్యం చేసినట్టే అవుతుందని కేటీఆర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో 1951లో 26.2 శాతం జనాభా ఉంటే.. 2022 నాటికి 19.8 శాతానికి చేరింది. ఇక ఉత్తరాదిలో 39.1 శాతం నుంచి 43.2 శాతానికి జనాభా చేరింది. దక్షిణాదిలో 6.4 శాతం జనాభా తగ్గగా, ఉత్తరాదిలో 4.1 శాతం జనాభా పెరిగింది.