అగ్రరాజ్యంలో భారతీయులపై జాతివివక్ష

81
racist
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాతివివక్ష పడగవిప్పింది. ఈ సారి ఏకంగా భారతీయ మహిళలపైనే దాడి జరగడం కలకలం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఉన్న భారతీయులు ఉలిక్కిపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టెక్సాస్‌లో ఉన్న డల్లాస్‌లో భారతీయ మహిళలపై జాతి వివక్ష దాడి జరిగింది. మెక్సికన్‌ కు చెందిన మహిళ ఓ పార్కింగ్‌ లాట్‌లో భారతీయ మహిళలను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ వారిపై దాడి చేసింది. కాగా ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూనే సదరు మహిళలను కొడుతూ… బూతులు తట్టింది. నేను ఎక్కడికి వెళ్లినా ఇండియన్స్‌ కనిపిస్తున్నారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. మీరు ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించింది

ఇండియాలో బెటర్‌ లైఫ్‌ లేకపోవడం వల్లే మీరు అక్కడి నుండి ఇక్కడికి వస్తున్నారని ఆరోపించింది. ఈ సందర్భంగానే తాను భారతీయులను ద్వేషిస్తానని చెప్పుకొచ్చింది. నేను ఇక్కడే పుట్టాను… ఇక్కడే పెరిగాను. కానీ మీరు ఇండియాలో పుట్టి ఇక్కడ ఉంటున్నారు. అక్కడ లైఫ్‌ బెటర్‌గా ఉంటే…మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని అమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా మహిళలపై దాడి వీడియో అమెరికాలోని ఇండియన్‌ కమ్యూనిటీలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు.

- Advertisement -