తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేసేందుకు సిద్దమవుతున్నారు. గత కొన్ని రోజులుగా దిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై సీబీఐ, ఈడీ అధికారుల దాడుల నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్సీ కవితపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదని తేగేసి చేప్పిన…. తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై ఆమె పరువు నష్టం దావా వేయనున్నారు. దీని కోసం న్యాయనిపుణులతో కవిత చర్చలు జరుపుతున్నారు.
ఇటీవలే కేంద్రంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు ప్రతిగా కేసీఆర్ కూతురిని బద్నాం చేస్తే కేసీఆర్ తగ్గుతారని భావిస్తున్నారు. అలా ఏమి జరగదని మేం ఏవ్వరికి భయపడం మాది పోరాటాలు చేసే కుటుంబమన్నారు. ప్రాణత్యాగానికై సిద్దమన్నారు. ఎవరికీ భయపడేది లేదన్నారు. ఈడీలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. దిల్లీలో జరుగుతున్న లిక్కర్ స్కామ్ పర్యవసనాల గురించి నాకు ఏలాంటి సంబంధం లేదన్నారు.