హాట్ టాపిక్‌గా షా-ఎన్టీఆర్ భేటీ!

28
ntr
- Advertisement -

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు నోవాటెల్ హోటల్ లో జరిగిన ఈ భేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఏయే అంశాలపై వీరిద్దరూ చర్చించారు అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆర్‌ఆర్ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్ అద్భుత నటనను అమిత్‌ షా ప్రశంసించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని బీజేపీ నేతలు చెబుతున్న వచ్చే ఎన్నికల్లో సినీ గ్లామర్‌ని వాడుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.

- Advertisement -