ట్రెండింగ్‌లో గాడ్‌ ఫాదర్!

91
chiranjeeevi
- Advertisement -

మెగా ఫ్యాన్స్‌ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ టీజర్ వచ్చేసింది. చిరు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో ఉండగా టీజర్‌లో చిరు నటనకు అంతా ఫిదా అవుతున్నారు.

20 ఏళ్లు ఎక్కడికెళ్లాడో ఎవరికీ తెలీదు…సడెన్‌గా తిరిగొచ్చిన ఆరేళ్లకే జనంలో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు… అని మురళీశర్మ చెబుతున్న మాటలు హీరో పాత్రను ఎలివేట్‌ చేసేలా ఉన్నాయి. చిరు, సల్మాన్‌ల యాక్షన్‌ ఆకట్టుకుటోంది.

మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకొన్న ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కగా నయనతార, సల్మాన్‌ఖాన్‌, పూరీ జగన్నాథ్‌, సునీల్‌, సత్యదేవ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

- Advertisement -