- Advertisement -
జమ్మూకశ్మీర్‌లో పండిట్ల ప్రాణాలు పోవడానికి కారణం… కేంద్రం తీరు సరిగా లేకపోవడమన్నారు మాజీ ముఖ్యమంత్రి పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ.
ఇటీవల ఉగ్రవాదుల తూటాలకు బలైన కశ్మీరీ పండిట్ సునీల్ కుమార్ భట్ కుటుంబాన్ని కలువకుండా తనను గృహనిర్బంధంలో ఉంచారని ఆరోపించారు. తన ఇంటికి వేసిన తాళాలు, అలాగే ఇంటి ఎదుట నిలిపి ఉంచిన సీఆర్పీఎఫ్ వాహనాల ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
కశ్మీరీ పండిట్ల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదని, వాళ్ల తప్పుడు విధానాలతోనే పండిట్ల ప్రాణాలు కోల్పోపోవల్సి వస్తుందున్నారు. ఛోటిగామ్‌లోని భట్ కుటుంబాన్ని కలవడానికి తాను చేసిన ప్రయత్నాలను అధికారులు విఫలం చేశారని విమర్శించారు. తమను నిర్బంధంలో ఉంచడం మా భద్రత కోసమేనని అధికారులు చెప్పారని తెలిపారు.
- Advertisement -