బీహార్‌ మంత్రులకు నూతన మార్గదర్శకాలు :తేజస్వీ

41
tejasw
- Advertisement -

బీహార్‌కు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తేజస్వీ యాదవ్‌ తన సహాచర మంత్రులకు ఆరు మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ సూచనలను తప్పనిసరిగా పాటించాలని హూకుం జారీ చేశారు. ఈ నెలలోనే వరుసగా జరిగిన పరిణామాల క్రమంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ..ఆర్జేడీ పొత్తుతో నూతన ప్రభుత్వంను ఏర్పాటు చేసింది. కాగా ఆర్జేడీ నేతైన తేజస్వీ యాదవ్‌కు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజు నుంచి తన పనుల్లో నిమగ్నమయ్యారు. మంత్రులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడం, పనిలో నిజాయితీ, పనిలో పారదర్శకంగా వ్యవహరించడం లాంటి తదితర సూచనలు చేశారు.

నితీశ్‌కుమార్‌ ప్రభుత్వంలో ఉన్న ఆర్జేడీ మంత్రులు తమకంటే పెద్దవారిని తమ పాదాలను తాకనివ్వోద్దని, మర్యాద కోసం చేతితో నమస్కారం చేయాలని సూచించారు. మంత్రులందరూ మర్యాదతో ప్రజలతో మెలగాలని సూచించారు. రాష్ట్రంలోని కులమతాతలకతీతంగా ప్రాధాన్యత ఇస్తూ సహాయం చేయాలన్నారు. అదే విధంగా సభలకు సమావేశంలో పువ్వులు బొకేలకు బదులుగా పెన్నులు కాపీలు ఇవ్వాలని అన్నారు. అన్ని శాఖల పనితీరు గురించి ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడూ నివేదికలు ఇవ్వాలన్నారు. నితీశ్‌ నాయకత్వంలో మంత్రులు, ఆయా విభాగాలు, పని ప్రణాళికలను, అభివృద్ధి పనులను సోషల్‌ మీడియాల్లో నిరంతరం ప్రచారం జరగాలన్నారు. సమస్యల పరిష్కారానికి బీహార్‌ మహాకూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

- Advertisement -