కాళేశ్వరం మరో నెల రోజుల్లో పని చేస్తుంది: హరీశ్‌ రావు

94
harish
- Advertisement -

తెలంగాణలో ఎన్నడూ లేనంతగా అధిక వర్షాలు ఈ సంవత్సరంలో కురిశాయన్నారు మంత్రి హరీశ్‌ రావు. ప్రతిపక్షాలుకు ఏం పనిలేదు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం చాలా సిగ్గుచేటన్నారు. ఈ ఖరీఫ్‌ కాలంలో వర్షాల వల్ల కాళేశ్వరంలోని రెండు పంపుహౌస్‌లు మాత్రమే మునిగాయి. మిగిలిన 21 పంపుహౌస్‌ లు సేఫ్‌గా ఉన్నాయన్నారు. టెండర్లు ఇచ్చేటప్పుడే సంబంధిత కంపెనీకి పూర్తి బాధ్యతలు ఉంటాయి. వాటి పునర్‌నిర్మాణం, మరమ్మత్తులు కంపెనీలు చూసేలా టెండర్లు ప్రకటించమన్నారు. ఆయా టెండర్ల ప్రకారం కంపెనీలు పంపుహౌస్‌ ల పనులను పూర్తిచేస్తాయన్నారు. అందులో ఆయా టెండర్లల్లో 5సంవత్సరాల వరకు సదరు కంపెనీలు మాత్రమే మరమ్మత్తులు చేస్తాయని… ఇందులో ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టదన్నారు.

కాళేశ్వరం నీళ్లు లేనిదే గత యాసంగిలో పండిన పంటలను ఎందుకు కొనలేదో చెప్పాలన్నారు. దేశంలో ఏన్నడూ లేని విధంగా అత్యధికంగా వరి ధాన్యం పండిస్తే పంటను ఏందుకు కొనలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. మా రైతుల బాయికాడ మోటర్లకు మీటర్లు మా ప్రాణం పోయిన పెట్టనియమన్నారు. వచ్చే యాసంగి పంటల నాటికి కాళేశ్వరం నీళ్లు అందిస్తామని మరో నెలరోజుల్లో పంపుహౌస్‌ మోటర్లు పనిచేసి రంగనాయక సాగర్‌, మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ ఇతర రిజర్వాయర్లకు నీళ్లు అందిస్తామన్నారు. మరో కొన్ని రోజుల్లో పోయి మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చూసి వద్దామన్నారు.

- Advertisement -