14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌

103
jagadeep
- Advertisement -

భారత 14వ ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా, వెంకయ్య నాయుడు వారసుడిగా జగదీప్‌ ధన్కర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. డిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతో పాటు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలువురు కేంద్ర మంత్రులు విపక్ష నేతలు ఎంపీలు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన జగదీప్‌ ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ అల్వాపై విజయం సాధించారు.

- Advertisement -