‘పటేల్‌ సర్’ గా జగ్గుభాయ్‌..

256
Jagapathi Babu new movie PATEL S.I.R
- Advertisement -

ఆయన హీరోనే కానీ విలన్‌ గా మారాడు. అంతటితో ఆగలేదు..హీరోలకే దడ పుట్టించాడు. హీరోగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ ని ఆకట్టుకుంటే..విలన్‌ గా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్‌ ఆడియన్స్‌ని కూడా తన పర్ఫార్మెన్స్‌తో ఫిదా అయిపోయేలా చేశాడు. అయితే ఆ హీరో కం విలన్‌ ఇప్పుడు మరోసారి హీరోగా మారనున్నాడు. మళ్ళీ హీరోగా అంటే.. లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో టైప్ సినిమాలతో కాదు.. ఫుల్‌ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
 Jagapathi Babu new movie PATEL S.I.R
ఇంతకీ ఆ సీనియర్‌ హీరో ఎవరనుకుంటున్నారా?..హీరోనుంచి విలన్‌గా మారి, పలు భాషల్లో తన విలనిజాన్ని చూపిస్తూ.. క్రేజీ విలన్‌గా దుమ్ముదులిపేస్తున్న ఆ సీనియర్‌ హీరోనే జగపతిబాబు. అవును. జగ్గుబాయ్‌ ఇప్పుడు మళ్ళీ హీరోగా రానున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న జగపతిబాబు ‘పటేల్‌ సర్‌’ సినిమాతో  మరోసారి హీరోగా తన మార్క్‌ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. వాసు పరిమిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
 Jagapathi Babu new movie PATEL S.I.R
ఈ రోజు వారాహి చలన చిత్రం ఆఫీస్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టార్ దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా థీమ్ తెలిసే ఓ టీజర్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ మేకోవర్ లో జగపతి బాబు క్రూయల్ గా కనిపిస్తున్నాడు.  ఈ సినిమాకు డీజే వసంత్ సంగీతం అందించనుండగా..రాజమౌళి తనయుడు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -