ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్..

53
vp
- Advertisement -

ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు ఇవాళ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. పార్ల‌మెంట్ భ‌వ‌నంలో ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. ఎన్డీఏ కూటమి త‌ర‌పున ప‌శ్చిమ బెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గ‌రెట్ అల్వా పోటీలో ఉన్నారు.

టీఎంసీ మిన‌హా 744 మంది స‌భ్యులు ఓటింగ్‌లో పాల్గొన‌నున్నారు. ఇక సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంట‌నే ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్నారు. రాత్రిక‌ల్లా ఫ‌లితం వెలువ‌డ‌నుంది. ఈ నెల 11వ తేదీన కొత్త ఉప రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

ప్రస్తుత సభ్యుల సంఖ్య 788 మంది ఉన్నారు. గెలవడానికి 390 కంటే ఎక్కువ ఓట్లు అవసరం. జగదీప్ ధన్‌కర్‌ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపు 515 ఓట్లు వస్తాయని అంచనా.

- Advertisement -