- Advertisement -
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్ తాజాగా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్విట్టర్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం రెండు గంటల పాటు కొనసాగింది. అయితే 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు ఉండబోతుందా?అని కేటీఆర్‌ను అడిగారు. ఈ ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ తెలంగాణ ప్రజలతోనే మాపొత్తు ఉంటుందని సూటిగా సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నెటిజన్ ప్రశ్నలు అడగ్గ కేటీఆర్ వాటికి బదులిచ్చారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
- Advertisement -