- Advertisement -
రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ఇక 8,9 తేదీల్లో 20 సెం.మీ వర్షపాతంకు మించి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని…7వ తేదీ తరువాత వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
అల్పపీడనం ప్రభావంతో అదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కుంభవృష్టి కురియనుందని తెలిపింది.
- Advertisement -