యంగ్‌ ఇండియాకు ఈడీ తాళం….

47
rahul
- Advertisement -

మనీలాండరింగ్‌ కేసులో భాగంగా దిల్లీలోని నేషనల్‌ హెరాల్డ్‌ కార్యాలయంపై దాడులు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా ఆ బిల్డింగ్‌లో ఉన్న యంగ్‌ ఇండియా కార్యాలయాన్ని పాక్షికంగా మూసివేసింది. అనుమతి లేకుండా కార్యాలయాన్ని తెరవడాన్ని వీల్లేదని స్పష్టం చేసింది. దాడులు చేసిన యంగ్‌ ఇండియన్‌ కార్యాలయంలోకి ఎవరూ చొరబడకుండా ఉండేందుకు ఆ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు అనధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పోలీసు బందోబస్తు మధ్య ఆ కార్యాలయానికి సీల్‌ వేశారు. ఈ చర్యను కాంగ్రెస్‌ ఖండించింది. ఇవి కాంగ్రెస్‌ పార్టీపై ప్రత్యక్ష దాడులని వీటినిపూర్తిగా ఖండిస్తున్నట్లు ఆపార్టీ ఎంపీ జైరామ్‌ రమేష్‌ ట్వీట్ చేశారు.

దిల్లీలోని నేషనల్‌ హెరా్ల్డ్‌ వార్తా సంస్థ కేంద్ర కార్యాలయంతో సహా 12 ప్రదేశాల్లో ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా భారతీయుల వాణిని వినిపించేందుకు 1938లో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను ప్రారంభించారు. అయితే ఇందులో భారీ కుంభకోణం జరిగిందని సోనియా, రాహుల్‌ గాంధీ, తదితరులకు దీనిలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ రాజకీయ నాయకుడు, న్యాయవాది సుబ్రమణ్య స్వామి 2012లో దిల్లో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే రాహుల్‌ గాంధీని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.

- Advertisement -