ఇది కూడా జోకేనా పీఎంజీ : కేటీఆర్‌

27
ktr
- Advertisement -

ప్రధాన మంత్రి తన అబద్దాల పర్వంలోని భాగంగా దేశంలోని ప్రజలందరికి 2022 నాటికి పక్కా ఇళ్లు ఇస్తామని ఇచ్చిన హామీని మర్చిపోయిన సంగతి కేటీఆర్‌ గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద దేశంలో ఏ ఓక్కరూ కూడా ఇళ్లు లేకుండా ఉండరన్నారు. కరెంట్‌, గ్యాస్‌, శౌచాలయం, ఇంటింటికి నల్లా కనెక్ట్‌ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి మర్చిపోయారా అని మోదీ ప్రసంగిస్తూన్న వీడియోను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌తి ఇంటిపైనా జాతీయ జెండా పెట్టాల‌ని ప్ర‌ధాని చెప్ప‌డం మంచిదే అని, 2022 నాటికి ప్ర‌తి ఒక్క‌రికి ఇళ్లు క‌ట్టిస్తామ‌ని ఇచ్చిన హామీ ఏమైంది? అని ప్ర‌శ్నించారు. ఇది కూడా జోకేనా? అని కేటీఆర్ ట్వీట్టర్‌ ద్వారా అడిగారు.

- Advertisement -