- Advertisement -
విడాకుల తర్వాత తన కెరీర్‌పై పూర్తిస్ధాయిలో దృష్టి సారించింది సమంత. ఇందులో భాగంగా ఇటీవలె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా రీసెంట్గా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. ఇందులో రణ్వీర్ అంటే తనకు ఇష్టమని ఆయనతో డ్యాన్స్ చేయాలనుందని చెప్పుకొచ్చింది.
దీనిపై స్పందించారు రణ్వీర్. నటిగా సమంత అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో కలిసి సినిమా చేయాలని ఉంది. సమంత అద్భుతమైన మనిషి, వ్యక్తిగా ఆమెపై ఉన్న ఇష్టం మరింత పెరుగుతోందని తెలిపారు.
సమంత ఎప్పుడూ చాలా జోవియల్ గా ఉంటూ, జోకులేస్తూ పక్కన ఉన్న వారిని నవ్విస్తుంది. మేమిద్దరం గతంలో కలిసి ఓ యాడ్ షూట్ చేశాం. మొదటిసారి ఆ యాడ్ షూట్ లోనే కలిశాం. ఆ తర్వాత మరింత క్లోజ్ అయ్యామని తెలిపారు. దీంతో ఇంకేముంది త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రావడం ఖాయమని పుకార్లు షికార్ చేస్తున్నాయి.
- Advertisement -