స్వదేశి నినాదంకు తూట్లు పొడుస్తున్న కేంద్రం :కేటీఆర్‌

27
ktr
- Advertisement -

ప్రధాని మోదీపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. నాడు మహాత్మాగాంధీ స్వదేశీ స్పూర్తిని ప్రజల్లో పెంపొందించడానికి ఆత్మనిర్భర్‌ చిహ్నంగా చరఖా ఉపయోగించారు. కాని ఇప్పుడు చేనేత, ఖాదీ వస్ర్త ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధానిగా నిలిచారు. ఇదేనా మీరు సాధించిన ఆత్మనిర్భర్‌ భారత్‌? కేంద్ర ప్రభుత్వం జాతికి తెలియజెప్పే స్వదేశీ నినాదం ఇదేనా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.


ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కానుకగా ప్రకటించిన నేతన్న బీమా పథకంపై భాజాపా రాష్ట్ర ఆధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలను కేటీఆర్‌ తిప్పికొట్టారు. గత ఎనిమిదేళ్లలో చేనేత కార్మికుల కోసం కేంద్రం ఏం చేసిందో ఎందుకు చెప్పరని ఆయన ప్రశ్నించారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ కరీంనగర్‌ జిల్లా అభివృద్ధికి ఏం చేశారని నిలదీశారు కనీసం తన సొంత నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్టస్టర్‌ కూడా మంజూరు చేయించలేని ఓ నిస్సహాయ ఎంపీగా బండి సంజయ్‌ని కేటీఆర్‌ అభివర్ణించారు.

- Advertisement -