- Advertisement -
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్కు మూడో స్వర్ణం వచ్చింది. . మూడో రోజు పోటీల్లో భాగంగా అచింతా షూలి 313 కేజీల బరువును ఎత్తి 73కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. స్నాచ్ రౌండ్ లో 140 కేజీలు, 143 కేజీలు ఎత్తి గేమ్స్ రికార్డ్ బ్రేక్ చేసిన షూలి.. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్ రౌండ్లో 166 కేజీలు, 170కేజీలు ఎత్తి స్వర్ణం సాధించాడు.
మలేసియాకు చెందిన ఎర్రీ హిదాయత్ మొహమ్మద్ 303 కేజీలు ఎత్తి పోటీల్లో రెండో స్థానంలో, కెనడాకు చెందిన షాద్ దర్సింగీ 298కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు.
- Advertisement -