50 నిమిషాల్లో వైరస్‌ గుర్తింపు : జీన్స్‌టుమి సంస్థ వెల్లడి

73
rtocr
- Advertisement -

ప్రపంచ దేశాలను కలవర పెడుతున్న మంకీపాక్స్‌ వైరస్‌ భారత్‌లోనూ అడుగుపెట్టింది. ఇప్పటికే నాలుగు కేసుల వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో నిమిషాల వ్యవధిలో ఈ వైరస్‌ను గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్‌ కిట్‌ను అభివృద్ధి చేసినట్టు జీన్స్‌టుమి సంస్థ మంగళవారం ప్రకటించింది. తమ కిట్‌ అత్యంత కచ్ఛితత్వంతో 50 నిమిషాలలోపే వైరస్‌ నిర్ధారణ చేస్తుందని తెలిపింది. ఇది ఆర్టీపీసీఆర్‌ రూపంలో పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ రూపంలో లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ విధానాన్ని ఆసుపత్రులు, విమానాశ్రయాలు, ల్యాబ్స్‌లో ఉపయోగిస్తారని తెలిపింది. ఇది సింగిల్‌ ట్యూబ్‌ మల్టిప్లెక్స్‌ రియాక్షన్‌ ఫార్మాట్‌లో మంకీపాక్స్‌, చికెన్‌పాక్స్‌ వైరస్‌ల మధ్య తేడాలను గుర్తిస్తుందని వెల్లడించింది. భారత్‌కు చెందిన మెడికల్‌ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్‌ హెల్త్‌కేర్‌ మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్‌ కిట్‌ను రూపొందించినట్లు ఇది వరకే ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి 75 దేశాలకు పాకింది. 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ అరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు అధికమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -