- Advertisement -
ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్‌గా భారత సంతతి వ్యక్తి నియమితులయ్యారు. వివిధ దేశాల సూక్ష్మ ఆర్థిక అసమానతల పరిష్కారం, వృద్ధి, దారిద్యరం, భూతాపం తదితర అంశాలపై ఇందర్‌మిత్ గిల్ పని చేశారని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్‌మాల్‌పాస్ ఓ ప్రకటనలో తెలిపారు. కార్మెన్ రెయిన్‌హర్ట్ స్థానంలో ఇందర్‌మిత్ గిల్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్‌గా నియమితులు కావడం తనకు ఎంతో గౌరవంగా ఉందన్నారు. చికాగో యూనివర్సిటీ, జార్జిటౌన్ యూనివర్సిటీలో బోధకుడిగా ఇందర్‌మిత్ గిల్ ఉన్నారు. ఆయన నియామకం వచ్చే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కౌశిక్ బసు తర్వాత ప్రపంచ బ్యాంక్ ఎకనమిస్ట్‌గా నియమితులైన రెండో భారత సంతతి ఆర్థిక వేత్త ఇందర్‌మిత్ గిల్.
- Advertisement -