మంకీపాక్స్ గాలి ద్వారా సోకే అవకాశం లేదన్నారు ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ . ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. లక్షణాలు ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉన్నప్పుడు,పెద్దగా దగ్గినప్పుడు వచ్చేతుంపర్ల ద్వారే సోకుతుందని స్పష్టం చేశారు.
మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. బాధిత వ్యక్తి నుంచి నమూనాలు సేకరించి, పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. రేపు సాయంత్రానికి రిపోర్టు వస్తుందన్నారు. ఈ నెల 6వ తేదీన బాధితుడు కువైట్ నుంచి వచ్చాడని తెలిపారు. బాధితుడు నీరసం, జ్వరంతో ఉన్నారు. దీంతో కామారెడ్డిలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌కు వెళ్లారు. శరీరంపై ఉన్న దద్దుర్లు మంకీపాక్స్ మాదిరిగా ఉండటంతో ఫీవర్ హాస్పిటల్‌కు వచ్చారని పేర్కొన్నారు. రోగికి దగ్గరగా ఉన్న ఆరుగురిని ఐసోలేషన్‌లో ఉంచామని స్పష్టం చేశారు. మంకీపాక్స్ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన వారు సమాచారం ఇవ్వాలన్నారు. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతాయని డాక్టర్ శంకర్ తెలిపారు.

