ఇక నుంచి సాయంత్రం ఓపీ : మంత్రి హరీశ్‌రావు

95
hospitals
- Advertisement -

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు రోగుల తాకిడి ఎక్కువైందన్నారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఓపీ సేవలు సాయంత్రం కూడా అందుబాటులో ఉంచాలని…దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని ఆదేశించారు.

మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకు కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది. అన్ని ప్ర‌భుత్వ‌, మెట‌ర్నిటీ హాస్పిట‌ల్స్‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7:30 గంట‌ల‌కే ఓపీ స్లిప్స్ పంపిణీ ప్రారంభించాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఇక మొద‌టి పేషెంట్ నుంచి చివ‌రి రోగి వ‌ర‌కు అంద‌ర్నీ వైద్యులు ప‌రీక్షించాలి. అన్ని ప‌ని దినాల్లో సాయంత్రం 4 నుంచి 6 గంట‌ల వ‌ర‌కు కూడా ఓపీ సేవ‌ల‌ను అందుబాటులోకి తేవాల‌ని ఆదేశించింది. మార్నింగ్ టైమ్‌లో ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించి సాయంత్రం వ‌ర‌కు రిపోర్ట్స్ రెడీ చేయాల‌ని చెప్పారు. సాయంత్రం ప్రారంభ‌మ‌య్యే ఓపీ సేవ‌ల్లోనే సంబంధిత రోగుల‌కు మందులు రాసి పంపించాల‌న్నారు. ఓపీ స‌మ‌యాల్లో త‌ప్ప‌కుండా ల్యాబ్‌లు కూడా ప‌ని చేయాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -