ఆర్జీవీ..కొవిడ్ ఫైల్స్!

- Advertisement -
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు మరో సంచలన చిత్రానికి తెరలేపారు. కొవిడ్‌ ఫైల్స్‌ పేరుతో కరోనా సమయంలో దేశంలో సంభవించిన సంఘటనలు, వాటికీ కారకులు ఎవరు అనే అంశంతో తెరకెక్కించబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు ఆర్జీవీ.

భయానకమైన కరోనా సెకండ్‌వేవ్‌ వెనుక ఉన్న కుట్రదారు కరోనా వైరస్‌ కాదు. అధికార యంత్రాంగ నిర్లక్ష్యం. దాన్ని కొవిడ్‌ ఫైల్స్‌ సినిమా నిరూపిస్తుంది. కరోనా సమయంలో లక్షలమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అవినీతి, నిర్లక్ష్యపూరిత, అయోగ్యమైన పరిపాలన యంత్రాంగం తీరును ఈ సినిమా చూపిస్తుందన్నారు.

ఇదొక రాజకీయ నేపథ్యం కలిగిన సినిమా. ఇందులో చూపించే కఠోర వాస్తవాలు ఓటర్లలో ఆగ్రహం తెప్పించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావాన్ని కూడా కొవిడ్‌ ఫైల్స్‌ సినిమా చూపిస్తుందని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

Gallery

Most Popular

- Advertisement -

తాజా వార్తలు