- Advertisement -
అందానికి అందం… నటనకు నటన ఉన్న నటి నిత్యామీనన్. మాట మాట్లాడినా.. నటించినా అంతే బోల్డ్ గా ఉంటుంది. హైట్ తక్కువైనా… క్యారెక్టర్ లో వెయిట్ ఉన్న నటనను కనబరుస్తూ అందరి మన్ననలు పొందుతూ తెలుగు, తమిళ్‌తో పాటు మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా పవన్ సరసన భీమ్లానాయక్ సినిమాతో సక్సెస్‌ను కొట్టింది.
అయితే నిత్యామీనన్ పెళ్లి గురించి ఇటీవలి కాలంలో పుకార్లు షికార్ చేస్తుండగా వాటిని కొట్టిపారేసింది నిత్యా. మలయాళ స్టార్ హీరోతో నిత్యా మీనన్ ప్రేమలో ఉన్నారనీ, త్వరలోనే పెళ్లి జరగబోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.
ఏ విషయమైనా నిజమని తెలిశాకే దాన్ని పబ్లిష్ చేయండి అంటూ మీడియాను కోరారు. అలా మొదలైంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిత్యా మీనన్ మంచి నటిగా గుర్తింపు పొందారు.
- Advertisement -