పోలవరం వల్లే ఈ భారీ నష్టం : రజత్‌ కుమార్‌

114
rajat
- Advertisement -

గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం గోదావరి ఉగ్రరూపాన్నికి గురైందన్నారు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కూమార్‌. హైదరాబాద్‌లోని జలసౌధలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం బ్యాక్‌ వాటర్‌ విషయంలో అధ్యయనం చేయాలని కేంద్రానికి ఎన్నోసార్లు నివేదించామని తెలిపారు. కాని ఇంతవరకు కేంద్రం నుంచి ఏ విధంగా స్పందించలేదన్నారు. బ్యాక్‌ వాటర్‌ వల్ల పంట నష్టంతో పాటు, చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులు, భద్రాచలానికి వాటిల్లే ముప్పు భద్రతా అంశాలపై రజత్‌ కూమార్‌ సమీక్షించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో లక్ష ఎకరాల వరకు మునిగిపోతాయని పేర్కొన్నారు. జలవనరుల శాఖలో ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్ విభాగం ఏర్పాటు చేసి కడెం ప్రాజెక్ట్‌కు ఇటీవలే మరమత్తులు చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. కడెం ఎగువ ప్రాంతాల్లోని నాలుగు మండలాల్లో 300 మీ.మీ వర్షం కురిసిందన్నారు. వాతారణంలో మార్పుల కారణంగా, క్లౌడ్‌ బరస్ట్‌ లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని రజత్‌ కుమార్‌ తెలిపారు. వరద నష్టం అంచనాలపై మీడియాలో వస్తున్న కథనాలన్నీ నిరాధారమైనవేనని కొట్టి పారేశారు.

భారీ వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 20 నుంచి 25 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. అగ్రిమెంట్‌లో పేర్కొన్న ప్రకారం ఆ నష్టాన్ని నిర్వహణ సంస్థలే భరిస్తాయని ప్రభుత్వాన్నికి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరో 45 రోజుల్లో కాళేశ్వరం పంప్‌హౌస్‌లు మరమత్తుల పనులు పూర్తవుతాయని రజత్‌కుమార్‌ తెలిపారు.

- Advertisement -