స్వల్పంగా శ్రీశైలంకు తగ్గిన వరద నీరు @ 173.8 టీఎంసీలు

99
srisailam
- Advertisement -

గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగాయి. కాని వర్షాల తగ్గు ముఖం పట్టడంతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 2,00,852 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వస్తున్నది. జూరాల ప్రియదర్శిని జలాశయం స్పిల్‌వే నుంచి 27,825 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా మరో 40,705 క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుతున్నది. అలాగే సుంకేశుల ప్రాజెక్టు నుంచి 1,32,322 క్యూసెక్కుల నీరు వస్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 877.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. 173.8 టీఎంసీలు నిల్వ ఉన్నది. ప్రస్తుతం ఎడమగట్టులో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. కరెంటు ఉత్పత్తి ద్వారా 19,070 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వెళ్తున్నది.

- Advertisement -