మరోసారి ప్రధానిపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు!

68
ktr
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ…దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని నియంత్రించ‌లేని ప్ర‌ధానిని మీరేమంటారు? అని ప్ర‌శ్నించారు. దేశంలో చొర‌బాటుదారుల‌ను నియంత్రించ‌లేని ప్ర‌ధానిని మీరేమంటారు? ఇలాంటి ప్ర‌ధానిని ఏమ‌ని పిలుస్తార‌ని నాలుగు ఆప్ష‌న్ల‌ను ఇచ్చారు.

ఎ. 56”
బి. విశ్వ‌గురు
సి. అచ్చేదిన్ వాలే
డి. పైన పేర్కొన్న‌వ‌న్నీ అన్ పార్ల‌మెంట‌రీ ప‌దాలు కాబ‌ట్టి తొల‌గించ‌బ‌డ్డాయి.

ప్రస్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -