మొక్కలను సంరక్షించడం మనందరి బాధ్యత

120
pallavi
- Advertisement -


రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంను స్ఫూర్తిగా తీసుకొని గండిపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ లు మాట్లాడుతూ పచ్చదనం పెంచడం, చెట్లను సంరక్షించడం లాంటి విషయాలు విద్యార్థులకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరం మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా విద్యాసంస్థలు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్, కొమురయ్య, డైరెక్టర్ యశస్వి, రాజేంద్రనగర్ ఏసిపి గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -