కీలకమైన మూడు పదవులకు నరీందర్‌ బత్ర రాజీనామా

48
narinder
- Advertisement -

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బత్ర కీలకమైన మూడు పదవులనుంచి తప్పుకున్నారు. ఈ మూడు వేర్వేరు అత్యున్నత క్రీడా సంఘాలలో కీలక సభ్యుడిగా ఉన్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోసీ), ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్), ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ లలో కీలక బాధ్యతలకు ఆయన రాజీనామా చేశారు. ఐవోఏ లో 2017 నుంచి, ఎఫ్ఐహెచ్ కు 2021 నుంచి అధ్యక్షుడిగా (రెండోసారి) కొనసాగుతున్నారు. ఐవోసీలో కౌన్సిల్ మెంబర్ గా 2019 లో ఎన్నికయ్యారు.

నరీందర్ బత్ర.. ఐవోఏ, ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా ఉండగా ఐవోసీలో కీలక సభ్యుడి (కౌన్సిల్ మెంబర్)గా వ్యవహరిస్తున్నారు. ఈ మూడు పదవులకు ఆయన ఏకకాలంలో రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం తన రాజీనామా లేఖలను సంబంధిత అధికారులకు పంపారు. తన స్వహస్తాలతో రాసిన రాజీనామా లేఖలను ఆయన ఐవోఏ, ఎఫ్ఐహెచ్, ఐవోసీ లకు పంపించారు. వ్యక్తిగత కారణాల రీత్యా నేను నా రాజీనామాను సమర్పిస్తున్నాను. ఇన్నాళ్లు మీరు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు అని లేఖలలో పేర్కొన్నారు.

- Advertisement -