ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని తెలుగు సీనీ నిర్మాతలు యోచిస్తున్నారు. ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయాలతో గత కొద్ది రోజులుగా నిర్మాతలందరూ ఇదే వ్యవహారంపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం పైన నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు షూటింగ్‌లు నిలిపివేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్ తర్వాత థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిందని…. దీంతో టాలీవుడ్ భారీ నష్టాలను చవిసూస్తుందని వాపోతున్నారు. వేసవిలో పెద్ద సినిమాలు సందడి చేయడంతో కాస్త కోలుకున్నట్లు అనిపించినా తాజాగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మళ్లీ తగ్గింది. ఈ క్రమంలో ఆగస్టు నుంచి కొన్ని రోజుల పాటు షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు వచ్చిన చిత్రాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి అన్ని సినిమా షూటింగ్‌లు ఆపేయాలనుకంటున్నారు. నిర్మాణ వ్యయం, కొవిడ్, ఓటీటీలు తదితర సమస్యలపై చర్చించిన తర్వాతే షూటింగ్‌లకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాతల మండలి త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం జులై 1వ తేదీ నుంచి 50 రోజుల తర్వాతే సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకోగా ఇప్పుడు దాన్ని పది వారాలకు పొడిగించాలని భావిస్తున్నారు.
ఆగస్టు 1నుంచి సినిమా షూటింగ్‌లు బంద్!
- Advertisement -
- Advertisement -