ఎనిమిదేండ్ల తర్వాత కేంద్రం మేల్కొన్నది. ఎట్టకేలకు పార్లమెంట్‌లో తెలంగాణ గిరిజన వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రేపట్నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులను కేంద్ర ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించే యోచనలో ఉంది.అయితే తెలంగాణలో కేంద్ర గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్ర యూనివర్సిటీల సవరణ బిల్లు-2022ను తీసుకురానున్నట్లు రాజ్యసభ బులెటిన్‌లో వెల్లడించారు. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో గిరిజన యూనివర్సిటీ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. ములుగు జిల్లా జకారం గ్రామంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది.
ఎట్టకేలకు కేంద్రం మేల్కొంది.
- Advertisement -
- Advertisement -